Tuesday, June 11, 2013

ఆరోగ్య సంరక్షణలో ఆయుర్వేదమ్ 

మనం తీసుకునే ఆహరం పరిమితిగా ఉండాలి మన శరీరానికి బలవర్నాలు అనేవి నిశ్చయంగా ఆహారం ద్వార కలుగుతాయి 
ఆయుర్వేదంలో గురు లఘు అనే పదార్ధాలను చెప్పారు 
వీటినే సింపుల్ అండ్ కాంప్లెక్స్ ఫోరం అఫ్ ఫుడ్స్ అని పిలిస్తారు . 
లఘు ఆహరం అనగా త్వరగ జీర్ణమయ్యేది,గురు ఆహరం కొంత సమయం తీసుకుంటుంది కాబట్టి మన జీర్ణ వ్యవస్థ పనితీరుని బట్టి మనం భాజనం /ఆహరం తీసుకోవాలని ఆయుర్వేదం చెప్తుంది.  మనం తీసుకునే ఆహార పరిమాణ, జత్తరగ్ని అనుసరించి ఉంటుంది .  కొన్ని సందర్బాలలో కొన్నిరకాల ఆహార పదార్ధాలు మన శరీరానికి ఇబ్బందిని కలిగిస్తాయి,మానాసిక మరియు శారీరిక వికారాలని కలిగిస్తాయి ,అందువలన మన వయస్సు, కాల , మాన పరిస్థితులను పరిగనలోనికి తీసుకోవాలి . మనం తీసుకునే ఆహారానికి పరిమాణం ఎంత అని ఆలోచిస్తే గురు లఘు గుణాలని బట్టి 3 భాగాలుగా కాని /సగ భాగంగా తీసుకోవాలని ఆయుర్వేద గ్రంధాలూ వివరిస్తున్నై. ఈవిధంగా తీసుకున్నప్పుడు అజీర్ణ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు ఆహరం సమగ్రంగా సంతులంగా తీసుకున్నప్పుడు ఆరోగ్యమే కాకుండా అందం వయస్సు నిలబడును అని శాస్త్రం చెప్తుంది 
ఆహారం విషయంలో చాలామంది చేసే పొరబాటు,ఏ మిటంటే వారు ముందుగ తీసుకున్న ఆహరం పూర్తిగా జీర్ణం కాకముందే మరల మరల తీసుకున్నపుడు రకరకాల రోగాలు జీర్ణ సమస్యలు తలేతుతున్నై. 
  1. మన దినచర్య అనేది సక్రమంగా ఉండాలి చాలామటుకు ప్రయత్న లోపం వలనే శరీరం మనస్సు ఇంద్రియాలు అనేవి ఇబ్బందికి లోనవడం వలన సమస్యలు వస్తునై . 
  2. ఉష కలన మల మూత్ర విసర్జన్ చేసాక (శౌచ కర్మ ) ఆయుర్వేదంలో వేగావరోధం వేగాలను బలవంతగా ఆపడం ద్వార రకరకాల సమస్యలు వస్తాయి 
  3. ప్రోదుటే  పండ్లు తోమే పుల్లల్లు వేప, కానుగ, జువ్వి లేత పుడకలతో పళ్ళు తోమితే  నోటిదుర్వాసన చిగుల్ల సమస్యలు దరిచేరవు  కొంతమందికి ముఖంగా పట్టణ ప్రాంతం వారికీ ఈ పదార్ధాలు దొరకవు కాబట్టి వీటిని దొరికినంత వరకు వాడుకోవడం శ్రేష్టం,ప్రతీ రోజు చెయ్య లేన్నప్పుడు రాత్రి పుట పళ్ళు తోమితే మంచి ఫలితం వుంటుంది
  4. మన ముఖ కండరాలు ద్రుడంగ ఆరోగ్యంగ ఉండదంకి నోటిలో ఔశదయుక్త తైలలతో కానీ నీళ తో కాని,ఔశదయుక్త ఘన పదార్ధాని నోటిలో పెట్టుకునన్నప్పుడు ముక్క కండరాలు దవడలు బుగ్గలు దృడంగా ఉంటాయి. గందూశం కావాలా ధారణ అనేవి రెండు ముఖ శుధీ  ప్రక్రియలు
  5.  మన ముఖాన్ని కదిగేవిధానం లో భాగంగా క్రింది నుండి పైకి ముఖాన్ని రుద్డడం ద్వార ముఖం మృదువుగా ఉంటుందింఉఖన్ని చల్లనీటితో కఫ పిత్త ప్రక్రితులు గలవారు,వేడి, గోరువెచ్చటి నీరు వట ప్రకృతి గలవారు కడగాలి 
  6. ముఖ అందానికి కళ్ళకు కాటుక మంచిదే దీనికే కృష్ణ సుర్మ్మ  స్రోతో అంజనం వాడడం మంచది నీరుకరతం ,కంటి దోషాలు అనేవు రాకుండా ఉంటై

ఆరోగ్య  సంరక్షణలో ఆయుర్వేదమ్  
డా పెద్ది రమాదేవి  BAMS , DHA , BPR
SURAKSHA AYURVEDIC CLINIC SANJEEVA REDDY NAGAR,NEAR BALKAMPET ELLAMMA TEMPLE 
HYDERABAD-ANDHRA PRADESH

ఆయుర్వేద వైద్య శాస్త్రంలో  ఆరోగ్యవంతుని ఆరోగ్యం కాపాడు కోవటంతో పాటు రోగనివారణ అనేది ప్రధాన లక్ష్యం. 
 ఆరోగ్య పరిరక్షణలో భాగంగా చరక,సుశ్రుతాది వైద్య ఋషులు అనేక విధానాలుగా పద్దతులు రోగనివారణ ఉపాయాలు అనేకం చెప్పారు 
ఆరోగ్య పరిరక్షణార్ధం దినచర్య , రుతుచర్య , రాత్రిచర్య అనేవి సంహిత గ్రంధాల ద్వార  మనకు వివరించారు. మనం తీసుకునే ఆహరం ద్వారానే మన శరీర అభివ్రిది అదేవిధంగా శరీర నాశనం జరుగుతుందని మన అందరికి తెలుసు. ప్రతి మానవుడి శరీరంలో సహజంగ ప్రకృతి , వికృతులు అనేవి ఉంటాయి. ఈ ప్రకృతి వికృతులు మన శరీరాన్ని సమాన స్థితిలో ఉంచడానికి సహాయ పడుతుంటే ఈ శరీరం సమాన స్థితిలో ఉంటుంది. శరీర ప్రక్రుతులను దోషాలు అని విక్రుతులను ధాతువులుగ పిలుస్తారు . 
దోష ధాతు మాలాలు అనేవి మనశరీరని సమాన స్థితిలో ఉంచి అటువంటు మానవుడు ఆరోగ్యవంతుడు అని పిలుస్తారు 
మనం తీసుకునే ఆహారాన్ని బట్టి వాత పిత్త కఫాలు అనేవి వృద్దిక్షాలు చెందడం జరుగుతుంది  ఎప్పుడైతే ఈ దోష ధాతు మల అగ్నులు సమన స్థితిలో ఉన్నప్పుడు ఆరోగ్యం అని ఆయుర్వేదం చెప్పింది  
మనం తీసుకునే ఆహారం ఆరు రుచులు కలిగి ఉంటుంది అవి మధుర,అమల,లవణ, కాటు తిక్త కాషాయ రసాలు 
ఈ ఆరు రుచులు మనం తీసుకునే ఆహరంలో ఒక్కటిగా రెండుగా అంతకంటే  అధికంగా కలిసి ఉంటాయీ ఈ ఆరు రుచులు మనం పద్దతిక తీసుకున్నప్పుడు ఇబ్బంది ఉండదు 
  1. వాత హర రసాలు : మధుర అమ్ల్ లవణ
  2. పిత్త  హర రసాలు :  కాషాయ తిక్త మధుర 
  3. కఫ హర రసాలు:  కాటు అమల తిక్త